అశ్వగంధతో ఈ సమస్యలను నయం చేసుకోవచ్చు.. జ్ఞాపకశక్తికి అధ్భుతమైన మూలిక..!

-

భారతీయ మూలికల్లో రారాజు.. అశ్వగంధ..ఆయుర్వేంలో దీన్ని ఎక్కువగా వాడుతారు. దీంతో జ్ఞాపకశక్తి, క్యాన్సర్ అన్ని వ్యాధులను నయం చేసుకోవచ్చు. అశ్వగంధ పేరు వినటం తప్ప… దానివల్ల వచ్చే లాభాలు గురించి చాలామందికి పెద్దగా తెలిసి ఉండదు..ఈరోజు అశ్వగంధ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

నిద్రలేమి..

అశ్వగంధని నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. నిద్రలేమి, పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి న్యూరో-వ్యాధుల చికిత్సలో ఈ మూలికన ప్రభావవంతంగా పనిచేస్తుంది. పిల్లలలో జ్ఞాపకశక్తి పెంచుతుంది.

గ్యాస్ట్రిక్ సమస్యలు

ఒత్తిడి-ప్రేరిత గ్యాస్ట్రిక్ అల్సర్‌లను నివారించడంలో, శారీరక దారుఢ్యాన్ని పెంచడంలో అశ్వగంధ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ మూలికకు జీర్ణశయాంతర పేగు పూతలని నిరోధించే సామర్థం ఉంది. వివిధ రకాల నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది.

బలహీనతని నివారిస్తుంది..

మీ రెగ్యులర్ డైట్‌లో అశ్వగంధను చేర్చుకోవడం వల్ల బరువు పెరుగుతారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. అశ్వగంధ సాధారణ బలహీనతకు, న్యూరో-కండరాల సమన్వయాన్ని మెరుగుపరచడానికి చక్కగా ఉపయోగపడుతుందని నిరూపించారు. అంతేకాదు బలహీనంగా ఉన్నవారు ప్రతిరోజు అశ్వగంధ తీసుకుంటే కొద్దిరోజుల్లో బలంగా తయారవుతారు.

స్పెర్మ్ క్వాలిటీకి…

ఈ మూలిక పురుషులకు పునరుత్పత్తి ప్రయోజనాలను అందిస్తుంది. సంతానం లేనివారిలో పునరుత్పత్తి హార్మోన్ స్థాయిలను తిరిగి సమతుల్యం చేస్తుందట. స్పెర్మ్ క్యాలిటీ గణనీయంగా పెంచుతుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రేరేపితం చేస్తుంది. సంతానం కలిగించడంలో ఉపయోగపడుతుంది.

అన్ని రకాల క్యాన్సర్లకు..

అశ్వగంధ పక్షవాతం కలిగించే బ్రెయిన్ స్ట్రోక్స్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలను, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లతో సహా అన్ని రకాల క్యాన్సర్‌లను మెరుగుపరుస్తుంది. వృద్ధుల చివరి దశలో చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అశ్వగంధ ఆధునిక చికిత్స కంటే ఎన్నో రెట్లు మేలని శాస్త్రవేత్తలు వివిధ అధ్యయనాల ద్వారా నిరూపించారు.

అశ్వగంధ పొడి రూపంలో ఉపయోగించినప్పుడు మెదడు, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మైటోకాన్డ్రియల్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మేధస్సు, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మీ ఆహారంలో ఈ హెర్బ్‌ని చేర్చుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version