కోడి కత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఎన్ఐఏ అధికారులు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం నాడు తిరస్కరించింది.

 

కాగా.. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు, వైజాగ్ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై కోడి కత్తితో శ్రీనివాసరావు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 5 సంవత్సరాలపాటు జైల్లో శ్రీనివాసరావు ఉన్నారు. అప్పట్లో ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయములో పెను దుమారం రేపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version