తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… తెలంగాణ రాష్ట్రంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో… రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత.. కరెంటు కష్టాలు, నేటి సమస్యలు, అన్నదాతల ఆత్మహత్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు తెరపైకి వస్తున్నాయి. 24 గంటల కరెంటు అసలు ఉండటం లేదు అంటూ చాలామంది ధర్నాలు చేస్తున్నారు.
అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంలో ఆంధ్ర వారి పెత్తనం ఎక్కువైందని కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే… రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి.. తెలంగాణలో నామినేటెడ్ పదవి అప్పగించింది. డక్కన్ క్రానికల్ ఎడిటర్.. ఆంధ్ర శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన శ్రీరామ్ కర్రీకి తెలంగాణ ప్రభుత్వ నామినేటెడ్ పదవి దక్కిందని అంటున్నారు. తెలంగాణ మీడియా, కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా జర్నలిస్ట్ కర్రి శ్రీరాం నియామకం అయ్యారు. రెండేళ్ల పాటు ఈ పదవిలో జర్నలిస్ట్ కర్రి శ్రీరాం కొనసాగనున్నారు.