ఇవాళ ఆదిలాబాద్ జనగర్జన సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి ఏం జరుగలేదన్నారు. పేదలకు, మహిళలకు మేలు జరిగిందంటే అది మోడీ వల్లనేనని తెలిపారు అమిత్ షా. కేవలం కేసీఆర్ కుటుంబమే తెలంగాణలో బాగుపడిందని తెలిపారు.
మనం ఇక్కడ నినాదిస్తే హైదరాబాద్ లో ఉన్న కేసీఆర్ కి వినపడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణలో విమోచన దినోత్సవం నిర్వహించామని తెలిపారు. గత తొమ్మిదేళ్లలో బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం మోడీ ప్రభుత్వం ఎంతో చేసిందని స్పస్టం చేశారు అమిత్ షా. డిసెంబర్ 03 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు అమిత్ షా. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలని తెలిపారు. ఎన్నికలు రాగానే అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకొని వస్తున్నారని.. ఆదివాసి మహిళ ద్రౌపది ముర్మును ప్రధాని చేశామని గుర్తు చేశారు అమిత్ షా.