దుండిగల్ ఏయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్

-

హైదరాబాద్లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్‌లో 213 మంది యువ పైలట్లు సైనిక విన్యాసాలు చేశారు. వీరితోపాటు ఇతర దేశాల సైనికాధికారులు విన్యాసాల్లో పాల్గొన్నారు. పిలాటస్ పీసీ-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్-30, సారంగ్ హెలికాఫ్టర్లతో చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

శిక్షణ పూర్తి చేసుకున్న సైనికులకు రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. మొదటగా సౌనికుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన తర్వాత మాట్లాడారు. పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ట్రెడిషన్, ఇన్నోవేషన్.. రెండింటినీ కలుపుకొనిపోతూ భాధ్యతను నిర్వర్తించాలని యువ పైలట్లకు సూచించారు.

“శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు శుభాకాంక్షలు. మీరు ఆఫీసర్లుగా రావడం సంతోషంగా ఉంది. మీ పైన మరింత బాధ్యత పెరుగుతుంది. శిక్షణ సమయంలో మీరు మీ కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు, పండుగలకు దూరంగా ఉండి శిక్షణను పూర్తి చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశ గౌరవం, దేశ భద్రత మీపైన ఆధారపడి ఉంటుంది. సరికొత్త ఇన్నోవేషన్లు వస్తున్నాయి. టెక్నాలజీ సాంకేతికంగా అనుగుణంగా అప్డేట్ అవ్వాలి. ట్రెడిషన్, ఇన్నోవేషన్.. రెండింటినీ కలుపుకునిపోతూ బాధ్యతను నిర్వర్తించాలి. అలాగే మన దేశ సంప్రదాయాలను గౌరవిస్తూ పాటించాలి.” అని రాజ్నాథ్ సింగ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news