అమిత్‌షా మార్ఫింగ్‌ కేసు తెలంగాణకే పరిమితం కాలేదు: దిల్లీ పోలీసులు

-

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మార్ఫింగ్‌ వీడియోకు సంబంధించిన కేసు తెలంగాణాకే పరిమితం కాదని రాష్ట్ర హైకోర్టుకు దిల్లీ పోలీసులు నివేదించారు. దేశం నలుమూలలా వ్యాపించిందని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణతో పాటు నాగాలాండ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో పలువురికి సమన్లు జారీ అయినట్లు వెల్లడించారు. మన్నే సతీష్ తదితరులు వాస్తవాలు దాచి కఠినచర్యలు తీసుకోరాదంటూ ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులు పొందారని.. వాటిని తొలగించడం సహా అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ దిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

ఆ పిటిషన్‌ వాదనలు వినిపించిన పోలీసుల తరపు న్యాయవాది దర్యాప్తులో భాగంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించకపోవడంతో దిల్లీ పాటియాల కోర్టును ఆశ్రయించి మన్నేసతీష్, నవీన్, కోయగీతలపై నాన్ బేయిలబుల్ వారెంట్ పొందినట్లు తెలిపారు.

రాష్ట్ర పోలీసులు ల్యాప్‌టాప్‌లు సీజ్ చేయడం వల్ల దర్యాప్తునకు ఇబ్బంది ఏర్పడుతోందని తెలంగాణాలో నమోదైన కేసును దిల్లీకి బదిలీ చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి దర్యాప్తుపై మధ్యంతర ఉత్తర్వులు లేనప్పుడు ఇబ్బంది ఏముంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులను సవరించేందుకు నిరాకరిస్తూ విచారణను జూన్ 12కి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news