IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ ను వదిలివేయనున్న KL రాహుల్..?

-

లక్నో సూపర్ జెంట్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టును వీడెందుకు కేఎల్ రాహుల్ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. లక్నో సూపర్ జెంట్స్ ఓనర్ సంజీవ్ చేసిన పనికి బాగా హర్ట్ అయ్యాడట కేఎల్ రాహుల్. దీంతో వచ్చే రెండు మ్యాచ్లకు కెప్టెన్సీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడట.

Will KL Rahul step down from LSG captaincy for last 2 games

అలాగే వచ్చే ఏడాది ఐపీఎల్ 2025 టోర్నమెంటులో లక్నోకు ఆడకూడదని కూడా అనుకుంటున్నాడట. వేలంలోకి వెళ్లి ఏదైనా వేరే జట్టుకు ఆడాలని నిర్ణయం తీసుకున్నాడట కేఎల్ రాహుల్. దీంతో లక్నో సూపర్ జెంట్స్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, KL రాహుల్‌ను బండబూతులు తిట్టారు లక్నో సూపర్‌జెయింట్స్ సహ యజమాని సంజీవ్ గోయెంకా. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. నిన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ లో లక్నో దారుణంగా ఓడిపోయింది. ఈ తరుణంలోనే.. కేఎల్‌ రాహుల్‌ పై కోపంతో ఊగిపోయారు లక్నో సూపర్‌జెయింట్స్ సహ యజమాని సంజీవ్ గోయెంకా. రాహుల్‌ ను తిడుతూ.. కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news