ముగిసిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు.. ఫలితాల పై కోర్టు స్టే..!

-

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్ లో టీవోఏ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. అధ్యక్ష పదవీ కోసం రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు, మాజీ ఎంపీ జితెందర్ రెడ్డి రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్ నాథ్ బరిలో ఉన్నారు. సెక్రెటరీ, ట్రెజరర్స్ పదవుల కోసం ఎన్నిక జరుగుతుండగా.. మిగతా స్థానాలకు సభ్యుల ఎంపిక దాదాపు ఖరారు అయింది.

Olympic Association Elections

అయితే జనరల్ సెక్రెటరీ పదవీ కోసం బాబురావు, మల్లారెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉండగా.. ట్రెజరర్ పదవీకి సతీష్ గౌడ్, ప్రదీప్ కుమార్ బరిలో ఉన్నారు. టీవోఏ లో మొత్తం 68 మంది సభ్యులు ఉండగా.. పోలింగ్ ముగిసే సమయానికి 59 ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలను సవాల్ చేస్తూ.. బాక్సింగ్ సంఘం సిటీ సివిల్ కోర్టు ను ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు విచారణ పూర్తయ్యేంత వరకు ఫలితాల ప్రకటన పై స్టే విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version