ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చింది. మొద్దు నిద్ర లేచిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అలర్ట్ అయింది. హైదరాబాద్ నుండి గురుకులాల సందర్శనకు బయలుదేరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలను సందర్శించారు డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం.
అటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి ఏసీబీ సోదాలు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. పిల్లలకు అందుతున్న కాస్మొటిక్ చార్జెస్, పౌష్టికాహారం, ఆడిట్ వివరాలపై తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలాజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, పే అండ్ అకౌంట్స్ శాఖల అధికారులు సోదాలు నిర్వహించారు. హాస్టల్ లో పిల్లలు పడుతున్న ఇబ్బందులు, వసతులపై ఆరా తీస్తున్న ఏసీబీ అధికారులు.. పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందే హాస్టల్ లో సోదాలు చేస్తున్నారు.