ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లు ఉండాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు. విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టండని కోరారు. ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం అన్న సందేశాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లండని ఆదేశించారు.
అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కింది స్థాయికి తీసుకెళ్లండి… ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లు ఉండాలని కోరారు. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు…తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారన్నారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి…. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలని తెలిపారు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా మీరు పనిచేయాలి…క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండన్నారు.