ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే.. కలెక్టర్లతో సీఎం రేవంత్

-

ప్రభుత్వానికి కళ్లు, చెవులు జిల్లా పాలనాధికారులేనని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అన్నారు. తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించి పని చేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.  నేడు సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమై సమీక్ష నిర్వహించారు.

ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలని కలెక్టర్లకు సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోవాలని.. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకూ ఎలాంటి సంతృప్తి ఉండదని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలని.. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్​ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమన్న రేవంత్… విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిగా స్పందించారని సీఎం రేవంత్​ రెడ్డి గుర్తు చేశారు. అలాంటి స్పందనే కలెక్టర్లు బదిలీ అయినప్పుడూ ఉండాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version