ప్రజాభవన్ లో ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు

-

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ ప్రజా భవన్ లో కేకు కటింగ్ జరిపించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు నేతలు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా భట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

మధిర నియోజకర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు భట్టి విక్రమార్క. ఈయన 2009, 2014లో శాసన సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గతంలో శాసనసభ పక్ష నేతగా కూడా పని చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు భట్టి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సీతారామప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి సాగునీరు అందించే లక్ష్యంగా ఇప్పటికే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ తో కలిసి ఎన్నో సార్లు సమీక్షలు నిర్వహించారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రాజెక్టును ఈనెల 13 వరకు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news