సీఎం ఛాంబర్ పక్కనే డిప్యూటీ సీఎం ఛాంబర్..!

-

ఆంధ్రప్రదేశ్ లొో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేయగా.. ఏకంగా 164 సీట్లు గెలిచింది. సుమారు 94 శాతం సీట్లు సాధించి దేశంలోనే సంచలనం రేపింది.

ఏపీలో మంత్రివర్గ విస్తరణ పూర్తి అవ్వడంతో సచివాలయంలో కార్యాలయాల ఏర్పాటుపై సీఎం అధికారులతో భేటీ అయ్యారు. అయితే, మిత్ర పక్షం జనసేన ఆత్మగౌరవం దెబ్బతినకుండా చంద్రబాబు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే తన బ్లాక్లోనే పవన్కు ఓ చాంబర్ను కేటాయించాలని బాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్కు హై సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో మొదటి బ్లాకులోనే కేటాయించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, గత ప్రభుత్వం హయాంలో డిప్యూటీ సీఎం, మంత్రులకు 12, 3, 4, 5 బ్లాక్లలో చాంబర్లు ఉండేవి. సీఎం, సీఎస్లకు మాత్రమే మొదటి బ్లాక్లో చాంబర్లు ఉండేది. కానీ, సీఎం చాంబర్ పక్కనే డిప్యూటీ సీఎం చాంబర్ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news