ఓడిపోయినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదు : మంత్రి శ్రీధర్ బాబు

-

ప్రజల తీర్పును గౌరవిస్తూ.. 48 గంటల్లోనే రెండు పథకాలను అమలు చేశామని తెలిపారు. ప్రజల తీర్పును బాధ్యత రహిత్యంగా  చేశారు. ఆరున్నర కోట్ల మంది మహిళలకు ఆర్టీసీలో ఉచిత సేవలు అందుతున్నాయి. కాంగ్రెస్ హామీలపై ఒక బుక్ రిలీజ్ చేశారు. పాలన మొదలై 20 రోజులు కాకుండానే అప్పుడే గగ్గోలు పెడుతున్నారు. ఓడినా తరువాత కూడా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ ప్రారంభించడం.. వేలాది మంది ప్రజా దర్బార్ కి రావడం చూస్తేనే అర్థం అవుతుంది. పదేళ్ల నుంచి ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయో..?

ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్యల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిచే కార్యక్రమాలతో పాటు.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన హామీల గురించి 20 రోజులు కాకుండానే స్పందిస్తున్నారు. కనీసం సంవత్సర కాలం గడిచిన తరువాత అమలు చేయడం లేదు అని ప్రశ్నిస్తే.. బాగుంటుంది. కనీసం నెల రోజుల్లోనే ఇలా ప్రశ్నించడం హాస్యస్పదం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదన్నారు. అవినీతికి పాల్పడితే.. నా కుటుంబ సభ్యులనైనా జైలుకు పంపిస్తానన్నారు. మరీ ఏం చేశారు కేసీఆర్. 

Read more RELATED
Recommended to you

Latest news