ఈ సంవత్సరంలో టీ-20 ప్రపంచకప్ 2024 జరుగనున్న విషయం తెలిసిందే. యూఎస్ఏ, వెస్టిండిస్ వేదికలుగా జరిగే ఈ టోర్నీలో 20 జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. వన్డే ప్రపంచ కప్ 2023లో తలపడ్డ దాయాదులు భారత్, పాకిస్థాన్ టీ20 ప్రపంచ కప్ లో మరోసారి తలపడనున్నాయి. పొట్టి టోర్నీ కోసం అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు కాకున్నా.. క్రికెట్ వర్గాల ప్రకారం.. ఇండో-పాక్ మ్యాచ్ జూన్ 09న జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
గ్రూపు స్టేజీలో యూఎస్ఏ వేదికగానే భారత్ మ్యాచ్ లు ఆడనుంది. భాతర్ సూపర్ 8కి చేరుకుంటే.. జూన్ 20 నుంచి మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. సూపర్ 08 మ్యాచ్ లు వెస్టిండీస్ లో జరుగనున్నాయని సమాచారం. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ బార్బడోస్ వేదికగా జరుగనుందని సమాచారం. టీ-20 ప్రపంచ కప్ లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2024 ప్రదర్శన ఆధారంగా భారత జట్టు ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. భారత్-ఐర్లాండ్ జూన్ 5 న్యూయార్క్, భారత్-పాక్ జూన్ 09న న్యూయార్క్ లో జరుగనుంది. భారత్-యూఎస్ఏ జూన్ 12 న్యూయార్క్, భారత్-కెనడా జూన్ 15న ఫ్లొరిడాలో జరుగనుంది.