హైదరాబాద్ తో సమానంగా వరంగల్ అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

-

వరంగల్ అభివృద్ధికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ పర్యటనలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా మెడికల్ టూరిజం పై చాలా దేశాలు మనపై ఆధారపడుతున్నాయని  తెలిపారు.  ఫార్మా, ఐటీ రంగాలలో ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతుందన్నారు. తెలంగాణలో 10 నుంచి 12 ఫార్మా విలేజీలను తీసుకొస్తామన్నారు.

ప్రపంచ దేశాల నుంచి చాలా మంది బెస్ట్ వైద్యం కోసం హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. మహానగరాలకు విద్య, వైద్యం, విద్యుత్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెడికల్ టూరిజం హబ్ గా చేయడమే కాకుండా ప్రభుత్వం నుంచి ఉచితంగా వైద్యం అందించాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇందులో ప్రజల సహకారం కూడా ఉండాలన్నారు. వరంగల్ ను హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని, హైవేలను కనెక్ట్ చేస్తూ వరంగల్ ఓఆర్ఆర్ ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version