మెడికల్ టూరిజం పై చాలా దేశాలు మనపై ఆధారపడుతున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాజాగా వరంగల్ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్మా, ఐటీ రంగాలలో ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతుందన్నారు. తెలంగాణలో 10 నుంచి 12 ఫార్మా విలేజీలను తీసుకొస్తామన్నారు. ప్రపంచ దేశాల నుంచి చాలా మంది బెస్ట్ వైద్యం కోసం హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు.
మహానగరాలకు విద్య, వైద్యం, విద్యుత్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెడికల్ టూరిజం హబ్ గా చేయడమే కాకుండా ప్రభుత్వం నుంచి ఉచితంగా వైద్యం అందించాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇందులో ప్రజల సహకారం కూడా ఉండాలన్నారు. హెల్త్ కార్డులో ప్రొఫైల్ మొత్తం ఉంచుతున్నాం. హాస్పిటల్ కి ఎంత మంది వచ్చారన్నది కాదు.. ఆసుపత్రి నుంచి ఎంత మంది సంతోషంగా పోయారన్నది చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఏ పేదవాడు కూడా వైద్యం అందక చనిపోకూడదని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.