రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నాలు – కేటీఆర్‌

-

రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నాలు చేస్తామని ప్రకటించారు బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో రైతులతో, మా పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నాలు చేస్తామని తెలిపారు. ధర్నాకి వెళ్లే ముందు నిన్న ముఖ్యమంత్రి తెలంగాణ తల్లిని ఉద్దేశించి మాట్లాడిన చిల్లర మాటలకు నిరసనగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి నిరసనలో కూర్చోండన్నారు.

KTR’s sensational statement on the merger of BRS with BJP

ఒకవేళ విగ్రహం లేకపోతే తెలంగాణ తల్లి ఫ్లెక్సీ అయినా పెట్టి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుడిని క్షమించమని కోరండని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు కేటీఆర్. అటు జన్వాడ ఫాంహౌస్ నాది కానే కాదు…తప్పుంటే కూల్చేయండి అంటూ బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్వాడ ఫాంహౌస్ కూల్చేస్తారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్వాడ ఫాంహౌస్ తనది కాదని.. తన స్నేహితుడిదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version