హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తాతో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తాజాగా భేటీ అయ్యారు. థియేటర్ల లైసెన్సుల పునరుద్ధరణ సులభతరం చేయాలనే అంశంతో పాటు సినీ పరిశ్రమంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలపై ఈ సందర్భంగా వీరు చర్చిస్తున్నారు. ఈ భేటీలో దిల్ రాజుతో పాటు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు సునీల్ నా రంగ్ పలువురు ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.
ఇటీవలే పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుని ఇప్పుడు ఏం మాట్లాడట్లేదని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన దిల్ రాజ్ చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని రాజకీయ నాయకులను కోరారు. ఈ క్రమంలోనే ఇవాళ హోం శాఖ మంత్రి కార్యదర్శి తో దిల్ రాజ్ సమావేశం కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.