డిశ్చార్జి అయిన స్పీక‌ర్ పోచారం

-

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి హైద‌రాబాద్ ఏఐజీ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. గ‌త కొద్ది రోజుల క్రితం ఆయ‌న కు కరోనా వైర‌స్ సోకింది. దీంతో ఈ నెల 24 తేదిన‌ చికిత్స కోసం హైద‌రాబాద్ ల‌ని ఏఐజీ ఆస్ప‌త్రి లో చేరాడు. అయితే అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి కి క‌రోనా న‌యం కాలేదు.. కానీ ఆయ‌న ఆరోగ్యం బాగ‌నే ఉండి ఎలాంటి సమ‌స్య‌లు లేక పోవ‌డం తో డాక్ట‌ర్లు స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి ని ఇంటి కి పంపిం చారు.

అయితే స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి మాత్రం త‌న ఇంట్లో మ‌రి కొన్ని రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండ‌నున్నారు. కాగ ఇటీవ‌ల స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి త‌న మ‌న‌వరాలి వివాహం జ‌రిగింది. ఈ వివాహం లో నే ఆయ‌న కు కరోనా వైర‌స్ సోకిన‌ట్టు తెలుస్తుంది. ఈ వివాహా నికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్ర ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ హాజ‌రు అయ్యారు. కాగ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కావడంతో ఆయ‌న కుటుంబ స‌భ్య‌లు ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news