ఈనెల 16న న్యూట్రీషిన్ కిట్ల పంపిణీ – హరీష్ రావు

-

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, వైద్యాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 6.84 లక్షల మంది మహిళలకు 24 జిల్లాల్లోని 111 కేంద్రాల్లోకి ఇట్లనే పంపిణీ చేయనున్నారు. నేడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అరికటిక సంఘం నూతన భవనాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుత్రుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.

ఈ నెల 14 నుండి గర్భిణీలకు ఆరోగ్యంగా, బలంగా ఉండటం కోసం కేసీఆర్ న్యూట్రీషన్‌ కిట్ పంపిణీ చేస్తామన్నారు. సొంత జాగ ఉన్నవారికి ఇండ్ల నిర్మాణం కోసం రూ.3లక్షలు వారి ఖాతాలో వేయబోతున్నామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 600 పించను ఇస్తున్నారని.. రెండువేల పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేం లేదన్న హరీష్ రావు.. కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి శూన్యమని విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version