దీపావళి స్పెషల్.. ఆ నాలుగు రోజులు ఈ రెండు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

-

దీపావళి పండుగ వచ్చేసింది. నగర వాసులంతా తమ కుటుంబ సభ్యులతో పండుగను జరుపుకోవడానికి ఊళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కొన్నిసార్లు బస్సులు, రైళ్లు దొరకక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌలభ్యం కోసం దక్షిణ మధ్య  రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. 12,14,19, 21వ తేదీల్లో… సికింద్రాబాద్ – రాక్సోల్, నిజామాబాద్- నాందేడ్ స్టేషన్ ల మీదుగా జన సాధారణ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ రైళ్లలో 22 అన్‌రిజర్వ్‌డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయని వెల్లడించింది. దాదాపు 2 వేల 400 మంది కూర్చుని ప్రయాణించే వెసులుబాటు కలిగి ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ పేర్కొంది. సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్ , బాసర్ , ముద్ఖేడ్ , నాందేడ్, పూర్ణ తదితర తక్కువ దూరం ప్రయాణించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులంతా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారరు.

Read more RELATED
Recommended to you

Latest news