తెలంగాణలో మూడుసార్లు దీపావళి : అమిత్ షా

-

తెలంగాణలో ఇప్పటికే ఒకసారి దీపావళి పండుగను జరుపుకున్నారు. డిసెంబర్ 03న బీజేపీ అధికారంలోకి వస్తే.. రెండోసారి దీపావళి.. జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభమయ్యాక మూడో సారి దీపావళి చేసుకుంటారు. బీజేపీ అధికారంలోకి రామమందిరం దర్శనం ఉచితంగా కల్పిస్తామన్నారు. పసుపు రైతుల బోర్డు ప్రధాని ప్రకటించారు. పసుపు ఏర్పాటుతో ఉత్తర తెలంగాణ రైతుల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధానిగా చరిత్రలో నిలుస్తారన్నారు.

నిజామాబాద్ లో 500 బీసీ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఏర్పాటు చేస్తామనిహామి ఇఛ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి మూడు షుగర్ ఫ్యాక్టరీలను ప్రారంభిస్తామని తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీలను మోసం చేశాయి.ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కుటుంబ పార్టీలని.. బీజేపీ మాత్రం తెలంగాణ ప్రజల పార్టీ అని స్పష్టం చేశారు అమిత్ షా.

Read more RELATED
Recommended to you

Exit mobile version