హైడ్రా దెబ్బకు…హైదరాబాద్ లో పెట్టుబడి దారులు భయపడిపోతున్నారన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. హైడ్రా లక్ష్యం సంచులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సమకూర్చడమేనని… ప్రజల దృష్టిమరల్చడానికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచ్చిందని తెలిపారు. ఉన్నఫలంగా నిరాశ్రయులను చేయడం ఎంత వరకు న్యాయమని… హైడ్రా పేరుతో ప్రభుత్వం బెంబేలెత్తిస్తోందని ఆగ్రహించారు. హైదరాబాద్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
హైదరాబాద్ రావాలంటే పెట్టుబడి దారులు భయపడాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. కేసీఆర్ కు మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని… కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ ప్రజలు గమనిస్తున్నారని చురకలు అంటించారు. అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారని ఆరోపణలు చేశారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు మర్చిపోయారా ? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్లే మాట్లాడారు.. గతంలో మాట్లాడింది మర్చిపోయారా ?అని ప్రశ్నించారు.
నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి… కొందరికి ఒకలా… మరికొందరికి ఇంకోలా నిబంధనలు పెడుతున్నారని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి మోసం చేశారన్నారు.