కారుణ్యం అంటే అర్థం ఏమిటో బీఆర్ఎస్ నేతలకు తెలుసా : సీఎం రేవంత్ రెడ్డి

-

కారుణ్యం అంటే అర్థం ఏమిటో బీఆర్ఎస్ నేతలకు తెలుసా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాజాగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కొలువ పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పారదర్శన పాలన ఇవ్వాలనే ఇవన్నీ చేస్తున్నాం. నా మీద వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఉంటారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రూ.21వేల కోట్లు రైతు రుణమాఫీ చేసినందుకు నా మీద వ్యతిరేకత వచ్చిందా..? అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ హయాంలో పెద్దోళ్ల భూములకు అక్కర్లేదు అన్నట్టు పని చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు నా మీద వ్యతిరేకత వచ్చిందా..? భూమి చెరువులో ఉందా..? నాలాలో ఉందా తెలియదా..? సోషల్ మీడియా అంటేనే పెట్టుబడి దారులది అన్నారు. సచివాలయంకి రాని ఆయనకు పరిపాలన మీద పట్టు ఉందంట. కాంట్రాక్టర్లు సచివాలయం వద్దకు వచ్చి ధర్నా చేస్తున్నారంటే.. మా ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తున్నందుకే కదా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news