హైదరాబాద్ నగరంలో గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఐదు రోజులుగా సిబ్బంది క్షేత్రస్థాయిలోనే ఉన్నారని, వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. గత ఐదు రోజులలో 900 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నారాయణగూడ లో కొంత నీటి సమస్య ఉందని, ఇక నాలాల పనులు దాదాపు పూర్తి అయినట్లేనని తెలిపారు.
జిహెచ్ఎంసి పరిధిలో చేపట్టిన 36 పనుల్లో 30 పూర్తయ్యాయన్నారు విజయలక్ష్మి. గతేడాది సమస్యలు ఇప్పుడు లేవన్నారు. రానున్న 429 బృందాలు పనిచేస్తాయని తెలిపారు. ఇక నగరంలో శిధిలావస్థలో ఉన్న 483 భవనాలు గుర్తించి నోటీసులు ఇచ్చామని.. వాటిలో 92 భవనాలకు మరమ్మత్తులు చేసుకునే అవకాశం ఇవ్వగా.. మరో 19 భవనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ళ నుండి బయటకు రావద్దని సూచించారు.