చివరి బంతి వరకూ నువ్వా నేనా అన్నట్టు సాగిన ఇండియా మరియు బంగ్లాదేశ్ మహిళల వన్ డే చివరికి డ్రా గా ముగిసింది. బంగ్లాదేశ్ 226 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ముందుంచింది. ఇక ఆరంభం నుండి బాగానే ఆడినా, మధ్యలో వికెట్లను నిలబెట్టుకోవడంలో ఇండియా విఫలం అయింది. ఒక దశలో ఇండియా ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదిస్తుంది అనుకుంటే చివరికి మ్యాచ్ ఓడిపోతుందా అన్న వరకు వెళ్ళింది. ఇందులో స్మృతి మందన్న మరియు హర్లీన్ డియోల్ లు మాత్రమే అర్ద సెంచరీ లతో రాణించారు. ఇక చివర్లో జెమీమా రోడ్రిగస్ చివరి వరకు జట్టుకు విజయాన్ని అందించడానికి ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. ఆఖరి ఓవర్ లో మూడు పరుగులు చేయాలి చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది.. మొదటి బంతికి మేఘనా సింగ్ సింగిల్ తీసింది, రెండవ బంతికి రోడ్రిగ్స్ సింగిల్ తీసింది..
1 తో సమం అయింది.