కేసీఆర్ రోజా ఇంట్లో చేపలు తిన్నాడు.. ఎపెక్స్ మీటింగ్‌కు ఎందుకెళ్లలేదు? : ఎంపీ చామల

-

కృష్ణా నీటి జలాల తరలింపుపై అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.సాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 10వేల క్యూసెక్కుల చొప్పున నీటిని ఏపీ సర్కార్ తరలిస్తుంటే నీటి పారుదల శాఖ మంత్రి, సీఎం రేవంత్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. కాంగ్రెస్ మాత్రం గతంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన సంతకాల వల్లే నీరు తరలించుకుపోతున్నారని ఆరోపించారు.


తాజాగా ఈ వివాదంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. ‘రోజా ఇంట్లో చేపలు తిన్న కేసీఆర్..ఎపెక్స్ మీటింగ్ కు మాత్రం ఎందుకు వెళ్లలేదు. ఏపీ ఇష్టారీతిన గోదావరి,కృష్ణ జలాలు ఉపయోగిస్తుంటే, బీఆర్ఎస్ ఏం చేసింది?. హరీష్ రావు కేవలం రాజకీయాల కోసమే మాట్లాడుతున్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు కూడా నీరు రావడం లేదు’ అనివిమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version