42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కులగణన ముఖ్య ఉద్దేశమేంటో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. కులగణన పేరుతో వివిధ ప్రశ్నలు అడిగి సంక్షేమ పథకాల్లో తమ పేరు తీసేస్తారేమో అని ప్రజలు భయపడుతున్నారు. ప్రజలను భయపెట్టి మరీ సర్వే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు డబ్బు తరలి వెళ్తోందని ఆరోపించారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఈసీ సెక్యూరిటీ పెంచాలని కోరారు. రేవంత్ తన బావమరిదికి అమృతం ఇచ్చి..కోడంగల్ ఫార్మాతో ప్రజలకు విషం ఇస్తున్నారని మండిపడ్డారు. అమృత్ పథకంలో భారీ అవినీతి జరిగిందని.. ప్రభుత్వ తప్పులను తరచూ ఢిల్లీకి వచ్చి ఎండ గడతామన్నారు.