మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిపై కేసులు పెడతాం : కాకాణి

-

సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై కేసులు నమోదు చేస్తున్నారు. సోమిరెడ్డి చేసిన అవినీతి గురించి వాట్సాప్ లో పోస్ట్ పెట్టడంతో నా పైన కేసు పెట్టారు అని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. విచారణ సందర్భంగా పోలీసులు దాదాపు 54 ప్రశ్నలు అడిగారు. అయితే మద్యం, ఇసుకలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఆయన కుమారుడు దోచుకుంటున్నాడు. సోమిరెడ్డినాకు రాజకీయ ప్రత్యర్ది. కాబట్టి ఆయన పై రాజీలేని పోరాటం చేస్తాం అని కాకాణి అన్నారు.

ఇక వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. సోమిరెడ్డితో పాటు ఆయన కొడుకు భరతం పడతాం. ఒక్కొక్కరి తాట తీస్తాం. సోమిరెడ్డికి అనుకూలంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆ పోలీసుల రికార్డు కూడా నా దగ్గర ఉంది. వైసీపీ నేతలు పైన, కార్యకర్తల పైన అనుచిత పోస్టులు పెడుతున్న వారి వివరాలు సేకరిస్తున్నాం. మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరిపైనా కేసులు పెడతాము అని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version