సోలార్ ప్యానెల్స్ బిగించేందుకు ప్రతీ కుటుంబానికి రూ.75000 నుంచి రూ.80000 ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. సోలార్ తయారయ్యే కరెంట్ వల్ల జీరో కరెంట్ వస్తుందన్నారు. దియోఘర్ లో జరిగిన ఎన్నికల ప్రచారం ప్రధాని మోడీ మాట్లాడారు. ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలిన కరెంట్ ను ప్రభుత్వం కొంటుందని వెల్లడించారు. జార్ఖండ్ ను కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎం ఎన్నో ఏళ్లు పరిపాలించినా పేదరికం, వలసలు, నిరుద్యోగాన్ని తగ్గించలేదని విమర్శించారు. సంథాల్ పరగణా నుంచి సీఎం సోరెన్ పోటీ చేసినప్పటికీ మార్పు ఏమి లేదన్నారు.
మరోవైపు త్వరలో హిందీ సహా ఇతర భారతీయ భాషల్లో కూడా వైద్య విద్యను అందించాలని నిర్ణయించామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో మరో 75వేల మెడికల్ సీట్లు పెంచుతామని హామీ ఇచ్చారు. దేశంలో ఎయిమ్స్ ఆసుపత్రులను 24 కు పెంచామని గుర్తు చేశారు. ఆదివాసీల జనాభా క్రమ క్రమంగా తగ్గిపోతుంది. కబ్జా దారుల నుంచి జార్ఖండ్ ని రక్షిస్తామని తెలిపారు.