హైదరాబాద్ సిటీ బస్సుల్లో సీట్లు పెరిగాయి. గతంలో మహిళలకు రక్షణగా 1300 ఆర్డినరీ బస్సుల్లో అడ్డుతెరలు (డివైడర్లు) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మగవారు మహిళ ప్రయాణికుల వైపు వెళ్లకుండా అవి ఏర్పాటు చేశారు. వీటికోసం ప్రతి బస్సులో 4 సీట్లను తొలగించగా.. అలా ఆర్డినరీ బస్సుల్లో మొత్తం 5 వేల సీట్లు తగ్గాయి.
ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో మళ్లీ సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌లను నగరానికి తెచ్చి రూపురేఖలు మార్చి ప్రతి బస్సులో 45 సీట్లు తగ్గకుండా చూస్తున్నారు. అలా 800 బస్సులలో మొత్తంగా 3200 సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
మరోవైపు మహాలక్ష్మి పథకంతో నగరంలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక రోజులో ప్రయాణికుల సంఖ్య 11 లక్షల నుంచి 19 లక్షలకు పెరిగగా.. సోమవారం మాత్రం ఏకంగా 21.50 లక్షల మంది వరకూ ప్రయాణిస్తున్నారు. మిగతా రోజుల్లో 19 లక్షల వరకూ ఉంటున్నారని గ్రేటర్‌జోన్ అధికారులు తెలిపారు.