శుభ ముహూర్తాలకు నెలవైన మాఘ మాసం వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ఈ మాసం ప్రారంభం అవుతోంది. గత కొన్ని రోజులు మూడాలు ఉండగా ఇక ఇప్పుడు మంచి రోజులు వచ్చేశాయి. ఈ నెల నుంచి ఏప్రిల్ వరకు శుభకార్యాలకు అనుకూలంగా ఉందని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ మాసం నిశ్చితార్థాలు, వివాహాలు, శంకుస్థాపనలు, నూతన గృహప్రవేశాలు, విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయడానికి అవకాశం ఉందని తెలిపారు.
ఈ నెల 11వ తేదీ నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు బ్రహ్మాండమైన ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు చెప్పారు. ఈ నెల 14వ తేదీ వసంత పంచమి రోజున రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది పెళ్లిళ్లు ఉన్నాయి. అన్ని కల్యాణ మండపాలు ముందే బుకింగ్ అయ్యాయి. బ్యాండ్ మేళాలు, ఫొటో, వీడియో గ్రాఫర్లు, పూజారులు, క్యాటరింగ్, డెకరేటర్లు, ఈవెంట్ మేనేజర్లు ఇక నుంచి బిజీబిజీ అవ్వనున్నారు. బంగారు, వస్త్ర, పూల దుకాణాలకు గిరాకీ పెరిగి సందడిగా మారనున్నాయి.
ఫిబ్రవరిలో.. 11, 13, 14, 15, 18, 19, 21, 22, 24
మార్చిలో.. 1, 3, 7, 11, 13, 16, 17, 19, 20, 24, 25, 27, 28, 30
ఏప్రిల్‌లో.. 1, 3, 4, 5, 6, 9, 18, 19, 20, 21, 22, 24, 26