ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్యాడ్రుయేడ్స్ పరేడ్‌లో పాల్గొన్నారు. తాజాగా మరోసారి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. జులై 4న రాష్ట్రపతి ముర్ము నగరంలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. సోమవారం రోజున సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు.
‘‘4వ తేదీ సాయంత్రం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రోడ్ల మరమ్మతులు, బారికేడింగ్ చేపట్టాలి. ప్రొటోకాల్‌లో లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలి’’అని సీఎస్ ఆదేశించారు. డీజీపీ అంజనీకుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్‌శర్మ, అర్వింద్‌కుమార్, హోమ్ శాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, ప్రభుత్వ కార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాసరాజు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, సమాచార పౌరసంబంధాలశాఖ డైరెక్టర్ రాజమౌళి పాల్గొన్నారు.