అంతరిక్షంలో వరల్డ్​ కప్​ ట్రోఫీ ఆవిష్కరణ

-

ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 ట్రోఫీ వరల్డ్ టూర్​కు సిద్ధమైంది. ఎవరూ ఊహించని రీతిలో ఈ వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు నిర్వాహకులు. ఇంతకీ ఎలా ఆవిష్కరించారంటే..?

భూమికి లక్షా 20 వేల అడుగుల ఎత్తులో స్ట్రాటోస్పియర్​లో(స్పేస్​లో) ఈ ట్రోఫీని ప్రవేశపెట్టడం విశేషం. ఆ తర్వాత ట్రోఫీని నేరుగా అహ్మదాబాద్​ నరేంద్ర మోదీ స్టేడియంలో ల్యాండ్ చేశారు. ఈ ప్రపంచ కప్ ట్రోఫీ జూన్​ 27 నుంచి 100 రోజుల పాటు 18 దేశాల్లో ప్రపంచ యాత్రకు బయలుదేరనుంది. ఈ సందర్భంగా ట్రోఫీని స్పేస్​లో లాంఛ్​ చేయడానికి సిద్ధం చేసినప్పటి నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో ల్యాండ్​ అయ్యే వరకూ మూడు నిమిషాల వీడియోను ఐసీసీ తమ ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.

ఈ ప్రపంచ కప్​ ట్రోఫీని స్ట్రాటోస్పియరిక్ బెలూన్​కు కట్టి అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. భూమికి లక్షా 20 వేల అడుగుల ఎత్తులో ఉంచారు. ట్రోఫీ అంతరిక్షంలో ఉన్న ఫొటోలు, వీడియోలను 4కే కెమెరాలతో షూట్​ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news