తెలంగాణ యువతకు బిగ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించనున్నారు పోలీసులు. న్యూఇయర్ వేడుకల వేళ హైదరాబాద్‌లో పోలీసులు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక పరికరాలు తెప్పించారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడికక్కడే పరీక్షలు చేస్తున్నారు. మద్యం లిమిట్‌కు మించి తాగినా, డ్రగ్స్ తీసుకున్నా జైలుకే అని స్పష్టం చేశారు పోలీసులు. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించనున్నారు.. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా డ్రగ్స్ స్మగ్లింగ్‌పై పటిష్ట నిఘా పెట్టారు. ఓఆర్ఆర్‌పై వాహనాల తనిఖీలు, కాలేజీల వద్ద మఫ్టీలో పోలీసులు ఉండనున్నారు. కాగా, న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణలో ఈరోజు, రేపు రెండు రోజులు అర్థరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ గా ఉండనున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ సర్కార్.