కేసీఆర్ పాలనలో శతాబ్దంలో జరగని అభివృద్ధి దశాబ్దంలో జరిగింది – సత్యవతి రాథోడ్

-

మహబూబాబాద్ జిల్లా: ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష 2023 -24 ఫలితాలను క్యాంప్ కార్యాలయంలో అధికారులతో కలిసి విడుదల చేశారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 7252మంది పరీక్ష రాయగా.. 1347 మందికి 23 గురుకులాల్లో సీట్లు త్వరలో కేటాయిస్తామన్నారు. ఈ పలితాల్లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 10లోపు అడ్మిషన్ పొందడానికి చివరి అవకాశం అని తెలిపారు.

తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత సీఎం కెసిఆర్ పాలనలో గురుకులాల సంఖ్య పెరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నామన్నారు సత్యవతి రాథోడ్. సీఎం కెసిఆర్ పాలనలో 1లక్ష 35 వేల మంది విద్యార్థులు గురుకుల విద్యను పొందుతున్నారని తెలిపారు. సీఎం కెసిఆర్ పాలనలో శతాబ్దంలో జరగని అభివృద్ధి దశాబ్దంలో జరిగిందన్నారు. జూన్ 24 నుండి 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వబోతున్నామని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్.

Read more RELATED
Recommended to you

Latest news