తెలంగాణ క్యాబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్..!

-

తెలంగాణ క్యాబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమావేశానికి కొన్ని షరతులు విధిస్తూ అనుమతి ఇచ్చింది. కేవలం అత్యవసర విషయాలనే కేబినెట్ చర్చించాలని కండిషన్ పెట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ క్యాబినెట్ భేటీ పాల్గొనకూడదు అని సూచించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఉమ్మడి రాజధాని, రైత రుణమాఫీని వాయిదా వేయాలని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం శనివారం కేబినెట్ భే నిర్వహించాలనుకున్న విషయం తెలిసిందే. ఈసీ అనుమతి కోసం చివరి వరకు వెయిట్ చేసి వాయిదా వేశారు. దీంతో అనుమతి ఎప్పుడు లభిస్తే అప్పుడే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది మరోవైపు సోమవారం వరకూ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తామని, అప్పటికీ రాకపోతే ముఖ్యమంత్రి సహా మంత్రివర్గమంతా ఢిల్లీ వెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కలిసి రిక్వెస్టు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో సడన్ గా ఈసీ పర్మిషన్ ఇవ్వడంతో కాస్త ఊరట లభించినట్లైంది.

Read more RELATED
Recommended to you

Latest news