BREAKING : భద్రాద్రి రామయ్య కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి

-

మరికొన్ని గంటల్లో శ్రీరామనవమి పండుగ వచ్చేస్తుంది. భద్రాచలం శ్రీరామచంద్ర స్వామి ఆలయం ఈ వేడుక కోసం రంగరంగ వైభవంగా సిద్ధమవుతోంది. రామయ్య కల్యాణాన్ని వీక్షించేందుకు ఇప్పటికే చాలా మంది భక్తులు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. టికెట్లు దొరకని వారు, ఆలయానికి వెళ్లలేని వారు టీవీల్లో లైవ్ స్ట్రీమింగ్ చూస్తారు.

కానీ ఎన్నికల సంఘం భద్రాద్రి రామయ్య కల్యాణ ప్రత్యక్ష ప్రసారాన్ని నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈసీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాములోరి కల్యాణం ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఏప్రిల్‌ 4న ఎన్నికల సంఘం ఆంక్షలు విధించగా.. గత 40 ఏళ్లుగా లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తున్నామని, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ తెలంగాణ దేవాదాయశాఖ ఈసీకి లేఖ రాసింది. ఈసీ నిర్ణయంపై రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం తెలిపాయి. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం .. రేపటి క్యలాణ మహోత్సవాన్ని లైవ్‌ ప్రసారం చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news