తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే : ఈసీ

-

అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, ఓటరు జాబితా సంబంధిత అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం నవంబర్, డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సీఈవో తెలిపారు. అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి.. సన్నాహకాలు ప్రారంభించినట్లు వివరించారు.

17 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారిని ఓటర్ల జాబితాలో చేర్చడం, పోలింగ్ కేంద్రాలు, వాటిలో సౌకర్యాలు, ఓటర్ల జాబితా, ఫోటో సిమిలర్ ఎంట్రీల పరిశీలన తదితరాల గురించి వికాస్ రాజ్ ఆరా తీశారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఈవీఎంల మొదటి దశ తనిఖీ, అధికారులకు శిక్షణ గురించి వివరించారు. రాజకీయ పార్టీలు అన్ని బూత్‌లకు ఏజెంట్లను నియమించాలని కోరిన సీఈవో.. 34 వేల 891 పోలింగ్ కేంద్రాలకు గానూ కేవలం 1785 మంది ఏజెంట్లను మాత్రమే నియమించినట్లు పేర్కొన్నారు.

Video Player is loading.

వీలైనంత త్వరగా అన్ని కేంద్రాలకు ఏజెంట్లను నియమించాలని కోరారు. ఓటరు జాబితా నుంచి తొలగింపులు, ఫొటో సిమిలర్ ఎంట్రీల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఈఆర్ఓలను ఆదేశించినట్లు ఈసీ తెలిపారు. డేటా నమోదు సమయంలో పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలని చెప్పినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version