ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మరో మూడు రోజులు పొడిగింపు

-

ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కవిత ఇప్పటివరకు ఈడీ కస్టడీని ఇవాళ్టితో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా రౌస్ అవెన్యూ కోర్టులో  ఈడీ హాజరు పరిచింది. కోర్టులో కవిత కేసు విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు.. ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మరో మూడు రోజులు పొడగించింది.

లిక్కర్ కేసులో ఏడు రోజుల కస్టడి ముగియడంతో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు హాల్ లోకి తీసుకెళ్తున్న సమయంలో కవిత మాట్లాడారు. “నాది చట్టవిరుద్ధమైన అరెస్ట్ అని.. రాజకీయ కక్ష సాధింపుతోనే తప్పుడు కేసు పెట్టారు. మేము కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాం” అని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.  కవితను మరో 5 రోజులు కష్టడికి ఇవ్వాలని ఈడీ వాదించింది. తన క్లయింట్ కి బెయిల్ ఇవ్వాలని కవిత తరపు లాయర్ కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి మరో 3 రోజుల పాటు ఈడీ కస్టడిలోకి అప్పగించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version