ED officials searched Telangana minister Ponguleti Srinivasa Reddy’s house: తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు… నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఈడి అధికారులు… మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడి అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతోంది.
ఢిల్లీ నుంచి వచ్చిన 16 ఈడీ బృందాలు… ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క కంపెనీలో ఈ సోదాలు జరుపుతున్నాయి. సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రత నడుమ… ఈ రైట్స్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మంత్రి పొంగులేటి ఇంట్లో సోదాలు ఎందుకు నిర్వహిస్తున్నారో ఈడీ అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.