తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలువులు ఇవ్వాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు కేంద్ర నిబంధనలను, రాష్ట్రంలో కరోనా వైరస్, ఓమిక్రాన్ వేరియంట్ పై నివేదికలు సీఎం కేసీఆర్ కు అందజేసారు. వీటితో సీఎం కేసీఆర్ విద్యాసంస్థల పై నిర్ణయం తీసుకున్నారు.
అలాగే రాష్ట్రంలో ఇప్పట్లో లాక్ డౌన్ విధించే అవకాశాలు కూడా లేవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తే.. ఓమిక్రాన్ దూరం అవుతుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి ఉండవని తెలిపారు. అలాగే రాష్ట్రంలో బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. అలాగే ఇప్పటి వరకు 35 లక్షల టెస్టింగ్ కిట్లు ఉన్నాయని వాటిని 2 కోట్లకు పెంచాలని సూచించారు. వీటితో పాటు రాష్ట్రంలో ఇప్పటికే 99 శాతం ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయని దాన్ని 100 శాతంకు పెంచాలని అధికారులను ఆదేశించారు.