అల్లాహ్ అక్బర్ అని కేటీఆర్ అనగలడా.. అనే దమ్ముందా.? – కిషన్‌ రెడ్డి

-

అల్లాహ్ అక్బర్ అని కేటీఆర్ అనగలడా.. అనే దమ్ముందా.? అంటూ కిషన్‌ రెడ్డి నిలదీశారు. ప్రతి ఒక్కరు ఓటింగ్ వేసేలాగా ఒక మూవ్మెంట్ తీసుకువద్దాం..చదువుకున్న వారే ఓటింగ్ కు ముందుకు రావడం లేదన్నారు. మనమంతా ఐక్యమత్యంగా ఉండాలి.. హైదరాబాద్ ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మూడు సార్లు వరుసగా గెలిచి.. నాలుగో సారి వెయ్యి ఓట్లతో ఓడిపోయానని వెల్లడించారు.

ఓటింగ్ కు రాకపోవడం వల్లే ఓడాను.. అవతలి వ్యక్తికి నలభై వేల ఎంఐఎం ఓట్లు పడ్డాయన్నారు. శక్తికి వ్యతిరేకంగా పోరాడాలి అని రాహుల్ గాంధీ అంటడు..సనాతన ధర్మం లేకపోతే దేశం మరో పాకిస్తాన్ అవుతుందని హెచ్చరించారు. సనాతన ధర్మం లేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు..అల్లాహ్ అక్బర్ అని కేటీఆర్ అనగలడా.. అనే దమ్ముందా.? అని నిలదీశారు. అల్లాహ్ అక్బర్ ను విమర్శిస్తే కేటీఆర్ హైదరాబాద్ లో ఉంటాడా.? రాముడికి జై అంటే రాముడు అన్నం పెడుతాడా.? జీతాలు ఇస్తాడా.? అని కేటీఆర్ అన్నాడన్నారు. మీ అయ్యా కూడా హోమాలు యాగాలు చేస్తాడు కదా.! ఎందుకో అడుగు కేటీఆర్..దేశంలో సనాతన ధర్మం.. హిందూయిజం ఉన్నన్ని రోజులే దేశం సెక్యులర్ గా ఉంటుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news