బీజేపీ సంకల్ప పత్ర మేనిఫెస్టోలోని కీలక హామీలు

-

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘సంకల్ప పత్ర’ పేరుతో దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కలిసి ఈరోజు మేనిఫెస్టోను ప్రకటించారు.

మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో 14 అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ రూపొందించింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ 4లక్షల మంది పంపిన 15 లక్షల సలహాలు, సూచనలను పరిశీలించి కీలకాంశాలను పొందుపరిచింది.

మేనిఫెస్టోలోని కీలక హామీలు

  • 70 ఏళ్లు పైబడిన వృద్ధిలకు ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
  • పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు కట్టించడం
  • పైపు ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ అందజేత
  • వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేసే దిశగా కృషి
  • దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం
  • ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్‌ భారత్‌
  • మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులకు మార్చే ప్రణాళిక
  • ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు
  • డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు
  • కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు
  • మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
  • మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ కోసం ప్రత్యేక క్లస్టర్లు
  • ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం
  • సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహించడం
  • నానో యూరియా వినియోగం మరింత పెంచడం

Read more RELATED
Recommended to you

Latest news