రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభం

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం కీలక ఘట్టానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో 2290 మంది అభ్యర్థుల భవితవ్వమేంటో తేల్చేందుకు ఓటర్లు నడుం బిగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు.

మరోవైపు డీఆర్‌సీ కేంద్రాలకు నెమ్మదిగా పోలింగ్‌ సిబ్బంది చేరుకుంటున్నారు. అధికారులు వారికి అందజేస్తున్న ఈవీఎంలు, ఇతర సామగ్రిని తీసుకుని కేంద్రాలకు వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రంలోపు మొత్తం పోలింగ్‌ సిబ్బంది కేంద్రాలకు చేరుకోనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈసారి ఎన్నికల విధుల్లో 1.85లక్షల మంది విద్యార్థులు పాల్గొననుండగా.. 27,094 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌ ప్రక్రియ పరిశీలించేందుకు 22వేల మంది అబ్జర్వర్లు, స్క్వాడ్లు విధులు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news