‘బండి’ సారథ్యంలోనే ఎలక్షన్ వార్?

-

2019 పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు తెలంగాణలో బీజేపీకి పెద్దగా బలం లేదనే సంగతి తెలిసిందే…అసలు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది…కానీ 2019 పార్లమెంట్ ఎన్నికలోచ్చేసరికి నాలుగు పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది…ఇక అక్కడ నుంచి తెలంగాణలో బీజేపీ దూకుడు పెరిగిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ రాజకీయాల్లో కమలదళం దూకుడు ఓ రేంజ్‌లో పెరిగింది.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే పరిస్తితికి బీజేపీ వచ్చింది..అలాగే దుబ్బాక ఉపఎన్నికలో గెలవడం, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటడం…అలాగే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ని మట్టికరిపించడంతో పోలిటికల్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది..ఈ విజయాలన్ని బండి సారథ్యంలోనే వచ్చాయి..అసలు టీఆర్ఎస్‌పై పోరులో బండి ఎక్కడా తగ్గడం లేదు.

అయితే ఇలా బీజేపీకి కొత్త ఊపు తీసుకొచ్చిన బండి సారథ్యంలోనే బీజేపీ…వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళుతుందా? అంటే ముందస్తు ఎన్నికలకు వెళితే మాత్రం బండి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తారని చెప్పొచ్చు…లేదంటే కొత్త అధ్యక్షుడు కూడా వచ్చే ఛాన్స్ ఉంది…ఎందుకంటే ఈ మార్చి 11కు బండి అధ్యక్షుడుగా రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటారు…అంటే వచ్చే ఏడాది మార్చికి మూడేళ్లు పూర్తి అవుతాయి..మరి అప్పుడు బండి పదవీకాలం పూర్తి అవుతుంది.

బీజేపీ పాలసీ ప్రకారం…ప్రతి మూడేళ్ళకు కొత్త అధ్యక్షుడు వస్తారు…అలాంటప్పుడు నెక్స్ట్ ఏడాది మార్చిలో కొత్త అధ్యక్షుడు రావాలి. అప్పుడు కొత్త అధ్యక్షుడు వస్తే ఎన్నికలకు…కొత్త అధ్యక్షుడు సారథ్యంలోనే ముందుకెళ్లాలి. అయితే బండి వచ్చాకే బీజేపీకి కొత్త ఊపు వచ్చింది..ఈ ఊపుని ఇలాగే కంటిన్యూ చేయాలంటే బండిని మరోసారి అధ్యక్ష పీఠంలో కొనసాగించాలి..అప్పుడే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పొచ్చు..లేదంటే బీజేపీ మళ్ళీ ఇబ్బందుల్లో పడవచ్చు. అయితే బీజేపీ అధిష్టానం కూడా బండినే కొనసాగించి..ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version