ఎన్నికల బాండ్ల వివరాలు.. మేఘా ఇంజినీరింగ్‌ వాటా రూ.966 కోట్లు

-

ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మొత్తం 337 పేజీల డేటాను వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ డేటాను ఈసీ రెండు భాగాలుగా పేర్కొంది. రూ.11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఈ డేటా ద్వారా వెల్లడైంది. ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్న వివరాలను ఇందులో పొందుపరచలేదు.

తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ రాజకీయ పార్టీలకు రూ.966 కోట్ల విరాళం ఇచ్చినట్లు ఈసీ వెబ్సైట్లో పేర్కొంది. 2019 ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకూ ఆ సంస్థ కోటి రూపాయల విలువైన 966 బాండ్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. షిర్డీసాయి ఎలక్ట్ట్రికల్స్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఒక్క రోజే రూ.కోటి విలువైన 40 బాండ్లను కొనుగోలు చేసి రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version