నిజ్జర్ హత్యపై కెనడా డాక్యుమెంటరీ.. భారత్లో బ్యాన్

-

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యపై కెనడా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. నిజ్జర్ హత్యపై ఆ దేశ మీడియా సంస్థ ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేయడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్లో ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించింది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో కెనడా మీడియా వ్యవహరించిన తీరు ఇరు దేశాల మధ్య టెన్షన్ను మరింత రాజేసింది.

కెనడా ప్రభుత్వం అండతో నడిచే సీబీసీ అనే వార్తా సంస్థ ‘ది ఫిఫ్త్‌ ఎస్టేట్‌’ పేరుతో ఇన్వెస్టిగేటివ్‌ ప్రోగ్రామ్‌ను చేసి అందులోని ఓ ఎపిసోడ్‌లో నిజ్జర్‌ హత్యపై డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ‘కాంట్రాక్ట్‌ టు కిల్‌’ పేరుతో తీసిన 45 నిమిషాల వీడియోలో ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఉండటంతో మరోసారి వివాదానికి దారితీసింది. ఈ డాక్యుమెంటరీ ఏకపక్షంగా ఉందని, కొందరు ఇండో-కెనడియన్‌ కమ్యూనిటీ సభ్యులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ వీడియోపై కేంద్రం నిషేధం విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version