ఉచిత ప్రయాణం వల్ల ఆదాయం పెరుగుతోంది : సీఎం రేవంత్

-

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఇవాళ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే మహాలక్ష్మి స్కీమ్‌ వల్ల ఆటో కార్మికులు నష్టపోతున్నారని ప్రతిపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వారికి సమాధానమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల రాష్ట్ర ఖజానాకు క్రమంగా ఆదాయం పెరుగుతోందని తెలిపారు. ఫ్రీ ప్రయాణం వల్ల మహిళలు ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటి నుంచి కదిలారని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇన్నాళ్లు దైవదర్శనం చేసుకోలేకపోయిన వారు ఇప్పుడు తమకు ఇష్టమైన దైవదర్శనాలు చేసుకోవడానికి ఆర్టీసీ బస్సుల్లో కుటుంబంతో సహా వెళ్తున్నారని చెప్పారు. దాని వల్ల ప్రముఖంగా దేవాదాయశాఖ ఆదాయం పెరుగుతోందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version